Friday, April 19, 2024
Friday, April 19, 2024

సూర్యప్రభ, అశ్వ వాహనంలో ఊరేగిన వెంకటేశ్వరుడు

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఐదవరోజు శని వారం ఉదయము విశ్వకేశన ఆరాధన, యాగశాల ప్రవేశము, ద్వారా తోరణా, ధ్వజ కుంభ పూజ, అర్చకులు సుదర్శనాచార్యులు, సునీల్ కుమార్ తో పాటు తిరుమల తిరుపతి పురోహితులు ప్రశాంతు, భార్గవ, మహేష్ లు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ ప్రత్యేక పూజలు చేసి, నిత్య, శాంతి, మూలమంత్ర మూల గాయత్రి హోమాలు నిర్వహించారు. తదుపరి స్వామి వారి సయనోత్సవ పవళింపు సేవ కార్యక్రమం కూడా జరిగింది. ఉదయం సూర్యప్రభ వాహనము, సాయంత్రం అశ్వ వాహనం లలో పట్టణ పురవీధులలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థాన స్వాములచే నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలుకు వాహన ఉభయ దాతలుగా జగ్గా చంద్రకళ, జగ్గా సాయిశివరావు, జగ్గా మౌనికలు, మంచు కండి మంజువాని, కీర్తిశేషులు గాదంశెట్టి ప్రకాష్ గుప్తాల సహకారముతో నిర్వహిస్తున్నందుకు కమిటీ ప్రతినిధులు మేటికలకుల్లాయప్ప, దత్త శివ, బేళ్లే నాగప్ప, సాగా సురేష్, శంకర సంజీవులు, రంగా శీన, గుద్దిటి రామాంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారముతో ఈ షోడశ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ డి హెచ్ ఎస్.. వాలంటీర్లు, మహిళా మండలి వారు భక్తాదులకు, సహాయకులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, ట్రస్ట్ సిబ్బంది, అభివృద్ధి కమిటీ, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img