Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సూర్య ప్రభ చంద్ర ప్రభాహనాలలో దర్శనమిచ్చిన చెన్నకేశవ స్వామి

ఆలయచైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం వారి బ్రహ్మోత్సవ వేడుకలు ఈనెల 27వ తేదీ నుండి మే నెల 7వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ వైస్ చైర్మన్ కుండా చౌడయ్య,ఆలయ డైరెక్టర్లు, దాతలు, భక్తాదుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారు ఉదయం సూర్యప్రభ వాహనంలో సాయంత్రం చంద్రప్రభ వాహనంలో పట్టణ పురవీధులలో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్, గుణ స్వామి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉభయ దాతలైన గుద్దిటి నారాయణప్ప, బండ్లపల్లి వెంకట జయప్రకాష్, అంబటి సతీష్, కట్టా భాగ్యమ్మ అండ్ సన్స్, అన్నం మల్లికార్జున, ఫణి కుమార్, షర్మిల అండ్ సన్స్, జింక కన్న కంబయ్య, నాగ సుబ్బమ్మ అండ్ సన్స్, కోటం రవీంద్రనాథ్ బాబు, డిఎన్ఎమ్ సుంద రేషన్ అండ్ సన్స్, వెంకటేశ్వర ప్రసాద్, గోపాలకృష్ణయ్య సన్స్, గుద్దిటి నారాయణప్ప, సౌందర్యలహరి, సరసా దత్తు మూర్తి ల పేరిటన అర్చనతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఘనంగా స్వామివారి ఎదుట ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సత్కరించారు. స్వామివారి అలంకరణ భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. తదుపరి ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవ వేడుకలు మే 7వతేదీ తో ముగుస్తాయన్నారు. ఈ వేడుకలు కమిటీ, దాతల సహాయ సహకారములతో నిర్వహించబడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు జగ్గా జయలక్ష్మి, పోరాల్ల పద్మావతి, సత్రశాల సత్యనారాయణ, సౌందర్య లహరి సునీత, గిర్రాజు మహాలక్ష్మి, అన్నమయ్య సేవా మండలి పోరాల్ల పుల్లయ్య, వారి శిష్య బృందం, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img