Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల పోస్టర్లు….

విశాలాంధ్ర-గుంతకల్లు : సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు భూక్యా. వెంకటరమణ నాయక్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా సేవాలాల్ మహారాజ్ పోస్టర్లు ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవిఆర్ మాట్లాడుతూ బంజారా నాయకుల అరద్యా దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మన ఆంధ్రప్రదేశ్ మన నియోజకవర్గంలో పుట్టి మహా పుణ్యక్షేత్రంగా వెలిసిన సేవాగడ్ కు బంజారా సోదరులు ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 13, 14, 15, తేదీ లలో సేవాలాల్ మహానుభావుని జన్మదిన వేడుకలకు హాజరుకావాలని కావాలని తెలియజేచేశారు.దేశ విదేశాల నుండి బంజారా సోదరులు మన నియోజకవర్గంలో వెలసిన సేవా గడ్ కు తరలిరావడం మనకు ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బంజారా సభ్యులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గుంతకల్ సభ్యులు కోర్ర రాజేష్ నాయక్,గోపాల్ నాయక్,రాజు నాయక్ ,భాను నాయక్ ,రాము నాయక్,రామ్మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img