Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సేవా కార్యక్రమాలను చేయుటలో ఎల్లప్పుడూ ముందంజలో రోటరీ క్లబ్‌

రోటరీ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు.. కృష్ణమూర్తి, రామకృష్ణ
విశాలాంధ్ర`ధర్మవరం : సేవా కార్యక్రమాలను చేయుటలో రోటరీ క్లబ్‌ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని రోటరీ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమూర్తి, రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం పట్టణంలోని కోట పురపాలక పాఠశాలలో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ వారి సహకారంతో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరాన్ని నిర్వహించారు.శంకరా కంటి ఆసుపత్రి కంటి వైద్యులు డాక్టర్‌ ప్రియా వైద్య చికిత్సలను అందించి, కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను రోగులకు వారు తెలియజేశారు. ఈ శిబిరానికి క్యాంపు చైర్మన్గ నరేంద్ర రెడ్డి,రవాణా సౌకర్య దాతలుగా కీర్తిశేషులు కే ఉలిక్కి రెడ్డి కుమారుడు కె. రామచంద్రారెడ్డి, వారి మిత్రులు, తదుపరి శిబిర దాతలుగా కీర్తిశేషులు మామిళ్ళ వెంకట రమణమ్మ జ్ఞాపకార్థం వారి భర్త మామిళ్ళ రంగనాయకులు వారి కుమారులు, కుటుంబ సభ్యులు వ్యవహరించడం జరిగింది.అనంతరం కృష్ణమూర్తి,రామకృష్ణ, జయసింహలు మాట్లాడుతూ రోటరీ క్లబ్బు దేశ, రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇందులో భాగంగానే ధర్మారంలో కూడా రోటరీ క్లబ్‌ ప్రతి సంవత్సరం అన్ని వర్గాల వారికి వివిధ రకాల సేవలను అందించడం జరుగుతోందన్నారు. ఇప్పటివరకు దాదాపు 30,000 మందికి కంటి ఆపరేషన్లను చేయించడంతోపాటు ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు.. ఈ శిబిరానికి 189 మంది కంటి రోగులు పాల్గొనగా, కంటి ఆపరేషన్లకు 94 మంది ఎంపిక కావడం జరిగిందన్నారు. కంటి ఆపరేషన్లు కూడా బెంగళూరుకు తీసుకొని వెళ్లి, ఉచితంగా ఆపరేషన్లు చేయించి, తదుపరి కంటి అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తదుపరి కంటి డాక్టర్‌ ప్రియా,పిఆర్వో.. శివ ప్రకాష్‌, దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్రశాల ప్రసన్న కుమార్‌, సోలి గాళ్ళ వెంకటేశులు, రత్నశేఖర్‌ రెడ్డి, రమేష్‌ బాబు, శివయ్య, సుదర్శన్‌ గుప్తా, బండారు చలం, శ్రీనివాసుల రెడ్డి, చందా జయచంద్ర, ఐదు మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img