Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

హెచ్ఐవి కలిగిన వ్యక్తికి హెపటైటి స్ బి వ్యాక్సిన్ అందించాలి

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ప్రతి హెచ్ఐవి కలిగిన వ్యక్తికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అందాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అదనపు సంచాలకులు డాక్టర్ వై కామేశ్వర ప్రసాద్ తెలియజేశారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలోని సేఫ్ కేర్ సెంటర్, హెచ్ఐవి పరీక్ష కేంద్రం, సుఖ వ్యాధుల పరీక్ష కేంద్రము మరియు ప్రభుత్వ వైద్య కళాశాలలోని స్టేట్ రిఫరల్ సెంటర్, వైరల్ లోడ్ కేంద్రాన్ని గురువారం స్టేట్ షేర్ ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సేఫ్ కేర్ సెంటర్ లో ప్రతి హెచ్ఐవి కలిగిన వ్యక్తికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ మూడు డోసులు అందేలాగా, వారు మందులు సక్రమంగా వాడేలాగా, వైరల్ పరీక్షలు నిర్ణీత సమయంలో జరిగేలాగా చూడాలని ఆదేశించారు. హెచ్ఐవి పరీక్ష కేంద్రంలో కొత్తగా సంపూర్ణ సురక్ష కార్యక్రమం ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. హెచ్ఐవి కలిగిన ప్రతి వ్యక్తి ఏ ఆర్ టి మందులు తీసుకునేలాగా చూడాలని కౌన్సిలర్ ను ఆదేశించారు. సుఖ వ్యాధుల పరీక్షా కేంద్రం సందర్శించి సుఖ వ్యాధి కలిగిన వ్యక్తికి మరియు భాగస్వామికి చికిత్స అందెలాగా చూడాలని తెలియజేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలోని వైరల్ లోడ్ కేంద్రాన్ని, స్టేట్ రిఫరల్ లేబరేటరీని సందర్శించి సందర్శించి ఏరోజుకారోజు రిపోర్టులు వచ్చేలాగా చూడాలని రిపోర్టులన్నీ ఆన్లైన్లో నమోదు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లా సూపర్వైజర్ జీవీ రమణ,మురళి, నారాయణస్వామి, కేర్ సెంటర్ డాక్టర్ సత్యనారాయణ, షేర్ ఇండియా ప్రతినిధులు నాగార్జున,శశిధర్, అనంత నెట్వర్క్ ప్రెసిడెంట్ వీరాంజనేయులు, ఐసిటిసి కౌన్సిలర్ సుబ్బారెడ్డి, ఎల్ టి చంద్రమోహన్, సుఖ వ్యాధుల కేంద్రం కౌన్సిలర్ చెన్నకేశవులు, వైరల్ లోడ్ కేంద్రం ఇంచార్జ్ డాక్టర్ శైలజ, నాగవేణి,నరేష్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img