Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వరకట్నపు వేధింపు కేసుల్లో ఇద్దరికీ 10 సంవత్సరాల3 నెలలు జైలు శిక్ష

వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని రేణుక అనే వివాహితపై భర్త, అత్తలు అదనపు కట్నం కోసం వేధించగా, మృతి చెందిన కేసులో వారి ఇరువురికి 10 సంవత్సరాల మూడు నెలలు జైలు శిక్ష విధించడం జరిగిందని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సుబ్రహ్మణ్యం గురువారం పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 2014లో పట్టణంలోని వైయస్సార్ కాలనీకి చెందిన మందాల రేణుక అను ఆమెను భర్త మందాల రామాంజనేయులు, అత్త మందాల వసుంధరములు అధిక కట్నం కోసం ప్రతి రోజు వేధించేవారు అని తెలిపారు. దీంతో మనోవేదనకు గురి అయిన మందాల రేణుక ఉరివేసుకొని మృతి చెందిందని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 41/2014 లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అనంతరం వారి ఇరువురిని రిమాండ్కు పంపడం జరిగిందని, తదుపరి అనంతపురం ఫోర్త్ ఎడిజే కోర్టు జడ్జి విచారణ జరిపి, పై కేసులో ముద్దాయిలైన ఇరువురికి 13 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగిందని వారు తెలిపారు. పై కేసును అప్పట్లో ధర్మవరం డిఎస్పి అభిషేక్ మహంత్- ఐపీఎస్ ను సత్యసాయి జిల్లా ఎస్పీ అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img