Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అనంత జిల్లాకు 104 వైద్య సేవ వాహనాలను ప్రారంభించిన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా జిల్లా వైద్యరోగ్య శాఖకు మంజూరు చేసిన ఆరు నూతన 104 వాహనాలను సోమవారం అసిస్టెంట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్ నందు జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలానికి ఒక వాహనం చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో 433 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ల కు వాహన కొరత ఏర్పడి నెలకు ఒకసారి మాత్రమే ఈ వాహనాలు విధులకు హాజరయ్యవని, ఇప్పుడు అదనంగా ఆరు వాహనాలు జిల్లా కు కేటాయించడం వల్ల నెలకు రెండు సార్లు గ్రామాలను సందర్శించడం వీలవుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ వీరబ్బాయి మాట్లాడుతూ… ఈ ః104ః వాహనాలను అనంతపురం రూరల్ కు రెండు, కనేకల్ మండలానికి ఒకటి, ఉరవకొండ మండలానికి ఒకటి, తాడిపత్రి కి ఒకటి మరియు ఒక వాహనం జిల్లా కేంద్రం లో రిజర్వ్ గా వుంటుంది అని అన్నారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాలు అధికారి డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ… జిల్లాలో 31 మండలాలకు 31 వాహనాలు విధులకు హాజరు అయ్యేవని ఈ వాహనాలు నెల కు ఒకసారి మాత్రమే విధులకు హాజరయ్యేవని ఇప్పుడు అదనంగా కొత్త వాహనాల చేరిక వల్ల నెలకు రెండు సార్లు విలేజ్ క్లినిక్ విధుల నిర్వహణకు సాధ్యపడుతుందని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఫ్యామిలీ డాక్టర్ విధానం నోడల్ అధికారి డా. సుజాత, ఆరోగ్య శ్రీ కొ- ఆర్డినేటర్ డా.కిరణ్ కుమార్, డా.నారాయణ స్వామి, డా.అనుపమ జేమ్స్, మలేరియా అధికారి ఓబులు,డెమో భారతి డిప్యూటీ, డెమో త్యాగరాజు,104 మేనేజర్ కృష్ణమూర్తి, వేణుగోపాల్,కిరణ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img