: ఈవీఎంలను జాగ్రత్తగా భద్రపరచాలి
: ఈవీఎం బాక్స్ లను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : జిల్లాకు కొత్తగా 12,570 ఈవీఎంలు వచ్చాయని, నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ లోని గోడౌన్ లలో ఈవీఎం బాక్స్ లను జాగ్రత్తగా భద్రపరచాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆదేశించారు.శనివారం అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ లో జిల్లాకు కొత్తగా వచ్చిన ఈవీఎంలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ తో పాటు డిఆర్ఓ గాయత్రీదేవి, ఆర్డీవో మధుసూదన్, పలువురు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీఎంలను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరి సమక్షంలో ఆయా ఈవీఎం గోదాము గదుల తలుపుల సీళ్లను జాయింట్ కలెక్టర్ తీయించారు. ఆ తర్వాత లోపల భద్రపరిచిన ఈవీఎం యంత్రాలతో పాటు గదులను, భద్రత చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరుస్తున్న తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీధర్ మూర్తి, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు కెవి రమణ, కోదండరాం, టిడిపి నాయకులు పవన్ కుమార్, బిజెపి నాయకులు ఈశ్వర ప్రసాద్, బీఎస్పీ నాయకులు హరిప్రసాద్, ఎన్నికలు విభాగం సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు.