Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

విశాలాంధ్ర`ఉరవకొండ : అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎల్‌ఎం. ఉమా మోహన్‌ రెడ్డి, కార్యదర్శి పి రమ ఆదేశాల మేరకు ఉరవకొండ శాఖా గ్రంధాలయంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయాధికారి ప్రతాపరెడ్డి తెలిపారు. శనివారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గ్రంథాలయాలు సమాజ అభివృద్ధిలో అంతర్భాగమని గ్రంథాలయాలను అన్ని తరగతుల వాళ్లు ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. అనంతరం ఆయన వారోత్సవాల కార్యక్రమ వివరాలను వెల్లడిరచారు, 14 న ప్రారంభ వేడుకలు – బాలల దినోత్సవం, 15 న – పుస్తక ప్రదర్శన, 16 న గ్రంధాలయ ఉద్యమ నాయకులను స్మరించుకోవటం, 17 న రచయితల సందేశాలు, 18 న విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహణ, 19 న మహిళా సాధికారత పై అవగాహన 20 న డిజిటల్‌ గ్రంథాలయాలపై అవగాహన, ముగింపు వారోత్సవాలు అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం జరుగుతాయని తెలిపారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img