Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

19న రైతు సంఘం ఆధ్వర్యంలో ‘ఛలో కలెక్టరేట్‌’ ధర్నాను జయప్రదం చేయండి

విశాలాంధ్ర` అనంతపురం వైద్యం : సిపిఐ, రైతుసంఘం ఆధ్వర్యంలో ‘ఛలో కలెక్టరేట్‌’ కార్యక్రమం ఉన్నది. ఆత్మకూరు మండలం ఎంపీడీవో ఆఫీస్‌ వద్ద శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ మాట్లాడుతూ… జిల్లా పిలుపుమేరకు రైతులకు అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలు మునుపెన్నడు లేనివిదంగా పలు దఫలుగా తుఫాన్‌, భారీ వర్షాల వల్ల రైతులు సర్వశం కోల్పోయారు అని పేర్కొన్నారు. అన్ని రకాల పంటలు నష్టం వాటిలితే వైసీపీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కాని పరామర్శించిన పాపానపోలేదు దుయ్యబట్టారు . కుంటలు, చెరువులు, డ్యాంలు, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పొంగి పొర్లి పోతున్నాయి, పిల్ల కాల్వలు లేకపోవడం వలన భారీగా పండ్ల తోటలు, చీని, దానిమ్మ, మామిడి, బొప్పాయి తోపాటు ఖరీఫ్‌ పంటలు వేరుశనగ, పప్పుశెనగ, పత్తి, ఆముదం, కంది, వరి 790 హెక్టారల్లో నష్ట పోయినట్టు, కేవలం 5.60 కోట్ల రూపాయలు మాత్రమే మాండూస్‌ తుఫాన్‌ వల్ల నష్ట పోయినట్టు ప్రభుత్వం నిర్ధారణ చేసిందని, లోపబూయిష్టమైన విధానాన్ని వ్యతిరేకస్తూ, రైతులను ఆదుకోవాలని సిపిఐ డిమాండ్‌ చేస్తుందన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన సోమవారం ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా సిపిఐ నాయకులు కార్యకర్తలు రైతులు అందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఆత్మకూరు మండలం కార్యదర్శి సనప నీళ్లపాల రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండారు శివ ,వ్యవసాయ కార్మిక సంఘం రాప్తాడు నియోజకవర్గ ఉపాధ్యక్షులు బి రామాంజనేయులు ముత్యాలన్న, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img