ప్రెషర్ మెడికోలకు ఆటల పోటీలను ప్రారంభించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఈనెల 21వ తేదీన మెడికల్ కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన మెడికల్ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ శ్రీదేవి శుక్రవారం తెలిపారు. చదువుతో ఒత్తిడితో సతమతమవుతున్న వైద్య విద్యార్థులకు వారిలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను, సాంస్కృతిక కార్యక్రమాల ప్రతిభను, ఆటల పోటీలలో దాగి ఉన్న ప్రతిభను, వ్యాసరచన, వ్యకృత్వ, చిత్రలేఖన, పాటల పోటీలు, మొదలగు కార్యక్రమాలు అన్ని నిర్వహించి వారికి బహుమతులను కూడా ఆ రోజు అందజేయడం జరుగుతుందని, 2020 బ్యాచ్ వైద్య విద్యార్థులు, డాక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులో ప్రిన్సిపాల్ టాస్ వేసి వారితో సరదాగా కొంతసేపు ఆడి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం, స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షులు ఆచార్య డాక్టర్ బి ఆర్ శ్యాంప్రసాద్, స్పోర్ట్స్ కమిటీ డాక్టర్లు డాక్టర్ మాల గుండ్ల భవాని, డాక్టర్ దివ్య, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ దగ్గుబాటి విజయ రాఘవేంద్ర, డాక్టర్ దుర్గ, డాక్టర్ సహజీర్, డాక్టర్ పునర్జీవన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ నరసింహ నాయక్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు 2కె 20,2కె 22 బ్యాచ్ మెడికోలు పాల్గొన్నారు.