Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

జాతీయ మెగా లోక్ అదాలతో 275 కేసులు పరిష్కారం

సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని సీనియర్, జూనియర్, కోర్టులలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లో కథలతో 275 కేసులు పరిష్కారం అయ్యాయని మండల న్యాయ విజ్ఞాన సదస్సు చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి, జూనియర్ సివిల్ జడ్జ్ శివపార్వతి, సెకండరీ మెజిస్ట్రేట్ మురళి, పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పోలీసులు,న్యాయవాదుల సహాయ సహకారాలతో ఈ లోక అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఈ లోకదాలతో రాజీ కాబడిన కేసులు మాత్రమే పరిష్కరించినట్లు కూడా వారు తెలిపారు. ఈ లోకదాలతో 2007 కేసులు పరిష్కారంలో బ్యాంకు రుణాలు 18 కేసులు (రూ.5,12,350), బిఎస్ఎన్ఎల్ కేసులు 11 (రూ.18,732), చెక్ బౌన్ కేసులు 13 (రూ.9,49,325), గొడవ కేసులు 53, ఇసుక రవాణా కేసులు మూడు (రూ.8,500), జాంబ్లింగ్ కేసులు 169 (రు.5,83,800), భరణం కేసులు ఒకటి, మొత్తం కేసులు 275 పరిష్కారం అయినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్టు డివిజన్ పరిధిలోని పోలీసులు, కోర్టు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img