Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రతిపక్షాల గొంతు నొక్కే జీఓ నెంబర్1 రద్దు చేయాలి

విశాలాంధ్ర – ఉరవకొండ : రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 మరియు 1861  పోలీసు యాక్ట్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ గురువారం ఉరవకొండలో సిపిఐ పార్టీ నాయకులు తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా తాలూకా కార్యదర్శి జె.మల్లికార్జున మాట్లాడుతూ ప్రభుత్వం ఇలాంటి ఎన్ని జీవోలు తెచ్చినా ప్రతిపక్షాల గొంతు నొక్కలేదన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. బ్రిటిష్ పరిపాలనలోని చట్టాలను తీసుకొచ్చి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిపై అక్రమ కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలను చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా నాయకులు చెన్నారాయుడు, ఉరవకొండ మండల కార్యదర్శి తలారి మల్లికార్జున, వజ్రకరూరు కార్యదర్శి సుల్తాన్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు రాజు, మహిళా సంఘం నాయకులు నూర్జహాన్,వన్నూరమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img