Friday, March 31, 2023
Friday, March 31, 2023

49 సార్లు రక్తదానం చేసిన అన్నలయ్య రఘు

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ పట్టణానికి చెందిన అన్నలయ్య రఘు ఇప్పటివరకు 49 సార్లు రక్తదానం చేసి ఆపదలో ఉన్న అనేక మందిని కాపాడి వారికి పునర్జనమని ఇచ్చారు. బుధవారం ఉరవకొండలో గవి మఠం రథోత్సవం సందర్భంగా వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో రఘు పాల్గొని రక్తదానం చేశారు. ఓ పాజిటివ్ రక్తం గ్రూపు కలిగిన ఈయన అనేకమంది రోడ్డు ప్రమాదాల జరిగి ఆపదలో ఉన్నవారికి, రక్తహీనతతో బాధపడుతున్న అనేక మందికి కూడా ఈయన రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ ఎవరైనా ఆపదలో ఉన్నాము తముకు రక్తం కావాలంటే వెంటనే అక్కడికి చేరుకొని రక్తదానం చేస్తానని అలాగే ఎక్కడ రక్తదాన శిబిరాలు నిర్వహించిన అక్కడికి వెళ్లి రక్తాన్ని దానం చేస్తానని తెలిపారు. అన్నలయ్య రఘును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవలసిన అవసరము ఉందని పలువురు ఆయనను ప్రసంశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img