విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ నుంచి కర్ణాటకకి అక్రమంగా తరలిపోతున్న 67 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని బుధవారం తెల్లవారుజామున ఉరవకొండ పట్టణ సమీపంలోని బళ్ళారి అనంతపురం-బైపాస్ రహదారి వద్ద స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఎస్ఐ ఫణింద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సబ్సిడీ బియ్యాన్ని ఇతర వాహనంలోకి మారుస్తుండగా పట్టుకున్నామన్నారు ఒక బొలెరో, మరో ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న గందోడి మారేష్, సుధాకర్, చంద్రశేఖర్ అనే వ్యక్తులును కూడా అరెస్టు చేయడం జరిగిందని బియ్యాన్ని కూడా సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు శివప్రసాద్ ఉరవకొండ సిఎస్డి టి రమేష్ బాబు పాల్గొన్నారు.