Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బి ఎస్ పి ఆధ్వర్యంలో ఘనంగా 73వ రాజ్యాంగ దినోత్సవం

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం :73వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని బహుజన సమాజ్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగర ఇంచార్జ్ కంచె గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంకే కుల్లాయప్ప, పట్టణ అధ్యక్షులు డి. గంగాధర్, హరి డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. 1947 నవంబర్ 26న డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ ఆధ్వర్యంలో 284 మంది కమిటీ వేసి రాజ్యాంగాన్ని లిఖిత పూర్వకంగా రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. రాజ్యాంగాన్ని కేవలం నూట ఎనిమిది రోజులకే రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అన్నారు. ఈ రాజ్యాంగాన్ని 105 సార్లు మార్పులు చేర్పులు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనారిటీలకు కూడా రిజర్వేషన్ వసతిని కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మండల అధ్యక్షురాలు రాఘవేంద్రమ్మ, రత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img