విశాలాంధ్ర-ఉరవకొండ : ఈనెల 8 వ తేదీన ఉరవకొండ మండల కేంద్రంలోని శ్రీ వాణి విద్యా నికేతన్ పాఠశాల నందు దివంగత వసికేరి గోపీనాథ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రస్టు సభ్యులు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్లను శనివారం ఉరవకొండలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతారాం ఆస్పత్రి వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో ప్రధానంగా గుండె, కంటి ఆపరేషన్లు,మరియు మోకాలు, భుజము, మెడకు సంబంధించిన సమస్యలకు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షలు కూడా ఉచితంగానే నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ కూడా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి వచ్చే వారికి మరియు ఆపరేషన్లకు సంబంధించి మిగతా సదుపాయాలు అన్నీ కూడా ఉచితంగానే అందించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ వసికేరి మల్లికార్జున, ఎంపీపీ చందా చంద్రమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు, వైసిపి ఉరవకొండ పట్టణ కన్వీనర్ ఓబులేసు, బసవరాజు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశులు, గోవిందు, ఆసిఫ్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ ఎర్రిస్వామి,, ప్రకాష్, ఎంపీటీసీ సభ్యులు ఈడిగ ప్రసాద్,వన్నూరు సాహెబ్, డొకారి హనుమంతు, వార్డ్ సభ్యులు ప్రభాకర్, ఓబులమ్మ, ఓబులేసు,వైసిపి నాయకులు అంజనేయులు, బీమా, జోగివిజయ్, రామిరెడ్డి, శర్మస్ ,తదితరులు పాల్గొన్నారు.