Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

92 ఏళ్ల వృద్ధురాలికి 10 నిమిషాల్లో స్టెంట్‌ అమరిక

కిమ్స్‌ వైద్యుల తక్షణ స్పందన
విశాలాంధ్ర `అనంతపురం వైద్యం :
పెద్దవయసు వారికి.. అంటే సాధారణంగా 75 ఏళ్లు దాటినవారికి స్టెంట్లు వేయడం సాంకేతికంగా చాలా సంక్లిష్టం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా 92 ఏళ్ల వృద్ధురాలికి అనంతపురం కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు కేవలం 10 నిమిషాల వ్యవధిలో అత్యవసరంగా స్టెంట్‌ అమర్చి, ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ వివరాలను ఆసుపత్రికి చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ మూడే సందీప్‌ మాట్లాడుతూ..
‘‘అనంతపురం జిల్లా పాపంపేట ప్రాంతానికి చెందిన 92 ఏళ్ల వృద్ధురాలు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తీవ్రమైన ఆయాసం, గుండెనొప్పితో అనంతపురంలోని కిమ్స్‌ సవీరా ఆసుపత్రికి రావడం జరిగిందన్నారు. వెంటనే ఆమెకు గుండెకు సంబంధించిన పరీక్షలు చేయగా తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, బీపీ చాలా తక్కువగా ఉందని తెలిసింది. వెంటనే వెంటిలేటర్‌ పెట్టి తగిన చికిత్స చేసి బీపీని అదుపులోకి తీసుకొని వచ్చామన్నారు. అనంతరం యాంజియోగ్రామ్‌ చేసి చూడగా, ఎడమవైపు రక్తనాళం 100% మూసుకుపోయింది. దీంతో ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆమెకు స్టెంట్‌ అమర్చాము. దాంతో రెండు రోజుల తర్వాత గుండె పంపింగ్‌ పెరిగి, రోగి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఎప్పటికప్పుడు మందులు వాడుతూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈమె నిండు నూరేళ్లు బతికే అవకాశం ఉంటుందన్నారు. 90 ఏళ్లు దాటినవాళ్లకు ఇలా స్టెంట్‌ వేయడం ఏపీలో ఇదే తొలిసారి. ఇంతకుముందు 88 ఏళ్లవారికి అమర్చారు. అసలు 75 ఏళ్లు దాటిన తర్వాత స్టెంట్‌ వేయడం చాలా కష్టం. అప్పటికే మన శరీరంలో వయసు సంబంధిత మార్పులు చాలా జరుగుతాయి. రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోవడం వల్ల అవి గట్టిబడిపోతాయి. అందువల్ల వాటిలో స్టెంట్లు వేయడం చాలా సంక్లిష్టం. స్టెంట్‌ వేసేటప్పుడుచాలా రకాల ఇబ్బందులు వస్తాయి. రక్తనాళాలు గట్టిబడిపోవడం వల్ల లోపలకు వెళ్లాక స్టెంట్‌ తెరుచుకోకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు రోగి చనిపోవచ్చు కూడా. కానీ కిమ్స్‌ సవీరాలో ఉన్న అత్యాధునిక సదుపాయాల వల్ల ఎంతటి సంక్లిష్టమైన కేసులనైనా చేస్తున్నాము అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img