విశాలాంధ్ర- అనంతపురం : మహిళలకు అండగా దీవెన సర్వీస్ డెవలప్మెంట్ సంస్థ ఎల్లప్పుడూ ఉంటుందని సంస్థ అధ్యక్షులు కె సునీత పేర్కొన్నారు. అనంతసాగర్ కాలనీ. లోని కార్యాలయంలో దీవెన సర్వీస్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పలు కార్యక్రమాలను ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీవెన సేవ డెవలప్మెంట్ సొసైటీ మహిళలకు చేతయు ను ఇవ్వడానికి ఏర్పాటు చేసిన సంస్థ. అనాధ వృద్ధులకు అనాధ పిల్లలకు ఆసరాగా ఉంటుందన్నారు. మహిళలు ఎదుర్కొండా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. మహిళలు తమ స్వసక్తితో ఎదగడం కోసం టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, బ్యూటిషన్, కంప్యూటర్ పై శిక్షణలు ఇస్తామన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు అందని వారికి అందేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. అనంతరం దాదాపు 50 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కే సునీత, ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్, కార్యదర్శి రజిత, కోశాధికారి వెంకట్ నారాయణ,, కార్యవర్గ సభ్యులు లక్ష్మీదేవి అంజనమ్మ, సరళ తదితరులు పాల్గొన్నారు.