Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుంది…

రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర -ధర్మవరం: రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని రిటైర్డ్ కంటి వైద్యాధికారి, ఇండియన్ రెడ్ క్రాస్ ధర్మవరం శాఖ చైర్మన్ డాక్టర్ నరసింహులు శ్రీ సత్యసాయి జిల్లా వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీవో హోమియో ఇండియన్ రెడ్ క్రాస్ వారు అఖిలభారత చిరంజీవి యువత సంఘం, రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరమును నిర్వహించుకున్నారు. ఈ శిబిరాన్ని డాక్టర్ నరసింహులు, పోలా ప్రభాకర్, డాక్టర్ సత్య నిర్ధారణ లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రెడ్ క్రాస్ ప్రతినిధులతో పాటు అఖిలభారత చిరంజీవి యువత సంఘం పట్టణ అధ్యక్షుడు సీనియర్ అభిమాని కడపల సుధాకర్ రెడ్డి రక్త దాతలతో ఈ శిబిరా విశిష్టతను తెలిపారు. ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సినీ యాక్టర్ చిరంజీవి దేశస్థాయిలో ప్రముఖ పాత్ర వహించడం జరిగిందని, ఈనెల 22న చిరంజీవి జన్మదిన వేడుకలు సందర్భంగా ఇటువంటి రక్తదాన శిబిరం నిర్వహించుట నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ వలన ఎంతోమంది రక్తం అవసరం ఉన్నవారికి రక్తదాతల ద్వారా పునర్జన్మ కలుగుతోందని తెలిపారు. తదుపరి ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్, పట్టణ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ నరసింహులు, డాక్టర్ సత్య నిర్ధారణలు మాట్లాడుతూ నేడు ధర్మవరం పట్టణంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎంతోమందికి ప్రాణదాతలు కావడం శుభదాయకమని, వారికి ప్రాణదాతలుగా నిలవడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఇందులో రక్త బంధం సొసైటీ నిర్వాహకులు కన్నా వెంకటేష్ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రక్తదానం చేయుటలో మంచి గుర్తింపు పొందడం మన ధర్మవరంకే ధర్మ కారణమని తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మున్ముందు మరిన్ని రక్తదాన శిబిరాలను స్వచ్ఛందంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళుతూ విజయపతంలో నడుస్తామని తెలిపారు. చిరంజీవి సీనియర్ అభిమాని కడపల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ శిబిరాన్ని నిర్వహించి ఇంతటి విజయానికి కారకులైన అందరికీ పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. మా అభిమాన సంఘం తరఫున రెడ్ క్రాస్ సంస్థకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం 35 మంది రక్త దాతలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రక్త బంధం సొసైటీ అధ్యక్షుడు కన్నా వెంకటేష్, రఫీ, శివప్రసాద్, వినయ్, ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులు రమేష్, కొండయ్య, కార్యదర్శి శివయ్య, అఖిలభారత చిరంజీవి యువత పట్టణ ఉపాధ్యక్షులు కోలా నాగార్జున, మంజునాథ్, ప్రవీణ్ కుమార్, హరి, అనంతపురం ఇండియన్ రెడ్ క్రాస్ భాస్కర్, మూర్తి, రఘువీర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img