Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

క్రీడలతోనే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు

. రాష్ట్ర స్థాయిలో కేజీబీవీ విద్యార్థినీల ప్రతిభ
. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన కీర్తి

విశాలాంధ్ర – మిడుతూరు: క్రీడలతోనే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మిడుతూరు కేజీబీవీ పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక కేజీబీవీ పాఠశాలలో ఈనెల 14వ తేదీలలో రాష్ట్రస్థాయి నెట్ బాల్ ఛాంపియన్ షిప్ కర్నూల్ లోని అవుట్డోర్ స్టేడియంలో సీనియర్ ఉమెన్ నెట్ బాల్ టోర్నమెంట్జ రిగింది. ఈ టోర్నీలో మిడుతూరు కేజీబీవీ విద్యార్థినిలు పాల్గొని రెండవ స్థానం సాధించడంతో కీర్తి ,గౌతమి , తులసి, మంజుల ,స్వప్న, ప్రియా లను అభినందించారు. కీర్తి అనే విద్యార్థిని ఈనెల 21 నుంచి 24 వరకు హర్యానా లోని సోనో ఫట్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో వ్యాయామ ఉపాధ్యాయురాలు సుమలతను పాఠశాల ఎస్ఓ అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img