Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

మెడ‌లో ర‌క్త‌నాళానికి స్టెంట్ వేసిన కార్డియాల‌జిస్టు

అత్యంత కీల‌క‌మైన క‌రోటిడ్ ఆర్టెరీ పూర్తిగా బ్లాక్‌
కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రిలో అరుదైన చికిత్స‌
బ్రెయిన్ స్ట్రోక్ వ‌చ్చిన వృద్ధురాలికి ఊర‌ట‌
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం
: మెడ ద‌గ్గ‌ర ఉండే ర‌క్త‌నాళాన్ని కెరోటిడ్ ఆర్టెరీ అంటారు. గుండె నుంచి మెద‌డుకు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేయ‌డంలో ఇది చాలా కీల‌కం. సాధార‌ణంగా గుండెలో ర‌క్త‌నాళాలు పూడుకుపోతే గుండెపోటు వ‌స్తుంద‌ని మ‌న‌కు తెలుసు. కానీ, మెడ ద‌గ్గ‌ర ఉండే ఈ కెరోటిడ్ ఆర్టెరీ దాదాపు పూర్తిగా పూడుకుపోవ‌డంతో మెద‌డుకు ర‌క్త‌స‌ర‌ఫ‌రా త‌గ్గిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వ‌చ్చిన వృద్ధురాలికి అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా వైద్యులు స‌కాలంలో గుర్తించి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మూడే సందీప్ తెలిపారు.
ాాఅనంత‌పురం న‌గ‌రానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి కుడిచెయ్యి, కుడికాలు బాగా బ‌ల‌హీన‌ప‌డ‌టంతో ఆమె ఒక న్యూరాల‌జిస్టు వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ స‌మస్య‌ను బ్రెయిన్ స్ట్రోక్ అని నిర్ధారించారు. ఎంఆర్ఐ తీస్తే ఒక ర‌క్త‌నాళం బ్లాక్ అయిన‌ట్లు తెలిసింది. అందుకు కార‌ణాలు ఏంట‌ని మ‌రింత లోతుగా ప‌రీక్ష‌లు చేయ‌గా… గుండె నుంచి మెద‌డుకు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే అత్యంత కీల‌క‌మైన కెరోటిడ్ ర‌క్త‌నాళం (ఇది మెడ ద‌గ్గ‌ర ఉంటుంది) 99% బ్లాక్ అయిన‌ట్లు గుర్తించారు. ఇది చాలా సంక్లిష్ట‌మైన స‌మ‌స్య కావ‌డంతో అక్క‌డినుంచి కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి పంపారు. బీపీ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్లే ఆయ‌న‌కు ఈ కీల‌కమైన ర‌క్త‌నాళం దాదాపు పూర్తిగా బ్లాక్ అయిన‌ట్లు గుర్తించాము. దానికి స్టెంట్ వేయ‌డం మెరుగైన మార్గం కావ‌డంతో, అందుకు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాలు అన్నింటినీ సేక‌రించి, కెరోటిడ్ ఆర్టెరీ స్టెంటింగ్ (సీఏఎస్) చేశాం. దాంతో మెద‌డుకు ర‌క్త‌స‌ర‌ఫ‌రా పూర్తిస్థాయిలో పున‌రుద్ధ‌రించ‌గ‌లిగాము. దీంతో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా రోగి పూర్తిగా కోలుకోగ‌లిగారు్ణ్ణ అని డాక్ట‌ర్ సందీప్ వివ‌రించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img