Friday, June 2, 2023
Friday, June 2, 2023

రథోత్సవానికి భక్తుడు విరాళం

విశాలాంధ్ర – ధర్మవరం : మే నెలలో జరగబోయే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవానికి రథసారథి, గుర్రాలను చేయించేందుకుగాను పట్టణంలోని గుడ్డి బావి వీధికి చెందిన ఏటూరి రజినీకాంత్, భార్య సుగుణ కుటుంబ సభ్యులు కలిసి మంగళవారం సాయంత్రం బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం కు ఒక లక్ష 116 రూపాయలను నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ప్రత్యేక పూజలను నిర్వహించారు. దాత మాట్లాడుతూ పట్టణములోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మహిమగల దేవుడని, తనవంతుగా, ఓ భక్తుడిగా ఈ విరాళాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కొనేదాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, బండ్లపల్లి రంగనాథ్ తేరు సేవాకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img