విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని మరూరు గ్రామం ఎస్సీ కాలనీలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ దేవత దేవాలయాన్ని నూతనంగా నిర్మించడానికి రాప్తాడు జెడ్పీటీసీ పసుపుల హేమావతిఆదినారాయణ, మాజీ వైస్ ఎంపీపీ పసుపుల కదిరప్ప కుటుంబ సభ్యులు తమవంతు సాయంగా గురువారం రూ. ఒక లక్ష విరాళం అందజేశారు. దేవాలయ నిర్మాణానికి భవిష్యత్తులో తమవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల కన్వీనర్ బి.నారాయణస్వామి, ప్రకాష్, మరూరు ఎస్సీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.