ఆర్థిక సహాయం చేసిన టిడిపి నాయకులు….
విశాలాంధ్ర- పామిడి (అనంతపురం జిల్లా) : పాము కాటుతో ఓ బాలిక మృతి స్థానికులు తెలిపిన మేరకు పామిడి మండలం పి కొండాపురం గ్రామానికి చెందిన వి ఓబులేసు, ప్రమీల దంపతులకు 15 ఏళ్ల వయసున్న కుమార్తె మానస ఉంది. బుధవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న మానస ని అర్ధరాత్రి దాటిన తర్వాత పాము కాటు వేసింది. ఆ సమయంలో మేల్కొని పామును గమనించిన బాలిక కేకలు వేయడంతో తల్లిదండ్రులూ మేల్కొన్నారు. వెంటనే పామును హతమార్చి బాలికను పామిడి ప్రభుత్వ వైద్యశాలకి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం మెరుగైన చికిత్స జిల్లా వైద్యశాల కోసం తీసుకెళ్లారు చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. పాము కాటుతో చిన్నారి మృతి తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రామంలో కష్టలలో వున్న తెలుగుదేశం పార్టీ సభ్యులకు తమవంతుగా ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఆ కుటుంబంకి అండగా ఉంటామని తెలిపారు..