Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

శ్రీ రామాలయంలో ఘనంగా భగవద్గీత సప్తహం

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : స్థానిక రెవిన్యూ కాలనీలోని శ్రీ రామాలయంలో వారం రోజులు పాటు ఘనంగా జరిగిన భగవద్గీత సప్తహం గురువారం ముగిసింది. వివేకానంద యోగ కేంద్రము, శ్రీ రామాలయం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేరళలోని ఆనంద ఆశ్రమానికి చెందిన స్వామిని మాతాజీ చంద్రా నంద్ ముఖ్య అతిథిగా పాల్గొని భగవద్గీత సప్తహం నిర్వహించారు. భగవద్గీత సాధన శిబిరాన్ని నిర్వహించి భక్తులకు భగవద్గీత గురించి వివరించారు. భగవద్గీత లోని సారాంశాన్ని వివరించడంతోపాటు భక్తులు భక్తుల సందేహాలను స్వామిని మాతాజీ చంద్రనంద్ నివృత్తి చేశారు. స్థానిక రెవెన్యూ కాలనీలోని రామాలయంలో భగవద్గీత సప్తాహం సెప్టెంబర్ 8వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 14వ తేదీన భగవద్గీత హోమంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ శ్రీనివాసరావు, రవికాంత్ రమణ పాల్గొని కార్యక్రమం నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యోగ కేంద్రం అధ్యక్షులు, శ్రీ రామాలయం కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి, ట్రెజర్ సి. కృష్ణమూర్తి, ఇతర ముఖ్యులు సోమ సుందరం, కృష్ణ, గురుమూర్తి రెడ్డి, వివేకానంద యోగ కేంద్రం తరఫున j. రామయ్య, పుల్లయ్య, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా న్యాయవాది హరికృష్ణ, పాలసముద్రం నాగరాజు, సాయి, మానేరు నాగరాజు, కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కే నారాయణ రావు, బాల రంగయ్య, మహాలక్ష్మి రమణ, ధనలక్ష్మి, వెంకట్రావు చేర్చరా ముఖ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ రామాలయం పూజారి భరత్ ఆధ్వర్యంలో భగవద్గీత హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో మహిళా భక్తులు హాజరు కావడంతో రామాలయం కిటకిటలాడింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img