Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : ఉప్పుగుండూరు గ్రామంలోని పార్క్ సెంటర్ వద్ద అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 122వ జయంతి వేడుకలను వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జోన్ చైర్మన్ టిజే వి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు కొంజేటి వెంకట సురేష్ బాబు క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, గ్రామ పెద్దలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలను కొనియాడారు కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు అమరా వేణు, పులకణం రాజా, క్లబ్ అధ్యక్షులు దేసు రవి సుధాకర్, సామాజిక సేవా కార్యకర్త తెలగతోటి శామ్యూల్ ,గ్రామ పెద్దలు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img