Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

అంబేద్కర్ భవనానికి స్థలము, నిధులు, కేటాయించాలని మంత్రికి వినతి

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గానికి సంబంధించిన దళిత సంఘ నాయకులు గురువారం విజయవాడ నందు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ను కలిసి పెనుకొండ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నా అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించి అంబేద్కర్ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసి మా దళితుల ఆత్మగౌరవని కాపాడవలసిందిగా కోరామని ఆయన సానుకూలంగా స్పందించరని హైకోర్టు అడ్వకేట్ శివరామకృష్ణ తెలిపారు మంత్రి ఈ విధంగా స్పందించారని మాకు మా వైస్సార్సీపీ పార్టీకి అంబేద్కర్ అంటే గౌరవం ఉంది తప్పకుండ అంబేద్కర్ భవనానికి సహాయం చేస్తాము అని హామీ ఇచ్చినాడని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో దండోరా రామాంజి,నరసింహ మూర్తి, ,మునిమడుగు నరసింలు, కోనాపురం కోళ్లప్ప, రవికుమార్, నరసింలు టెంపో శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img