Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

విద్యతో ఉపాధి లేని యువతపై సర్వే

ఎన్ఎస్ఎస్ శాఖ సహాయకులు డాక్టర్ గోపాల్ నాయక్

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్, ఎస్కే యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపును గో ట్లురు గ్రామమునందు ఈనెల 25వ తేదీ నుండి 31 వ తేదీ వరకు “విద్యతో ఉపాధి లేని యువతతో సర్వే చేయడం” జరుగుతుందని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్ నాయక్ తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఈ సర్వే ఆధారంగా 15 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల మధ్య యువతపై సర్వే చేశామని వారు తెలిపారు. అనంతరం ఆ గ్రామంలో ఉండే యువతకు తగు సందేశాలను నివృత్తి చేసి తగు సూచనలు ఇవ్వడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ జీవన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తోపాటు అధ్యాపకులు షమీవుల్లా, ఆనందు, రామ మోహన్ రెడ్డి లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img