Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

బదిలీ అయినా ఉపాధ్యాయునికి ఘన సన్మానం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు హిందీ పండిట్ గా పని చేస్తూ ఇటీవల వచ్చిన సాధారణ బదిలీలను ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ అయిన ఉపాధ్యాయుడు వేణుగోపాలచార్యులను శుక్రవారం ఉపాధ్యాయులు మరియు పుర ప్రముఖులు తదితరులు ఆయనను ఘనంగా సన్మానించారు ఆయన యొక్క సేవలను ఉపాధ్యాయులు కొనియాడారు ఆయన సందర్భంగా మాట్లాడుతూ ఈ పాఠశాలలో పనిచేయడం కొత్త అనుభూతిని కలిగించిందని ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చడానికి నా వంతు కృషి చేశానని అలాగే గ్రిక్స్, సైన్స్ ఫెయిర్, మరియు పాఠశాల అభివృద్ధికి దాతల సహకారంతో ఎంతో కృషి చేశామని అందరూ నాకు కూడా సహకరించాలని పాఠశాల ను మంచి పేరు ప్రఖ్యాతలు తేవడానికి కృషి చేశామని 8 సంవత్సరాలు నాకు ఎటువంటి లోటు లేకుండా చూసుకున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భారతీయ సంస్కృతిని కాపాడాలని అందరూ మానవసేవయే మాధవ సేవగా సేవకు అంకితం కావాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ ,ఎంఈఓ చంద్రశేఖర్, వెంకట శ్రీనివాసులు, శివరాజ్, ప్రభాకర్, హనుమంతు రెడ్డి, గిరిజమ్మ, సిపిఐ శ్రీరాములు, బోధన సిబ్బంది బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img