Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర-పెనుకొండ : పెనుకొండ మండల విద్యాశాఖ అధికారిగా సోమవారం చంద్రశేఖర్ బాధ్యతలను ఎంఈఓ కార్యాలయం నందు స్వీకరించారు చంద్రశేఖర్ ఇంచార్జ్ ఎంఈఓ గా ఉన్న గంగప్ప ద్వారా బాధ్యతలు తీసుకున్నారు చంద్రశేఖర్ గతంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి జూన్ నెలలో జరిగిన సాధారణ బదిలీలలు ఉరవకొండకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుల బాధ్యతలు చేపట్టిన అనంతరం పెనుకొండలో మండల విద్యాశాఖ అధికారిగా ప్రభుత్వము పదోన్నతి కల్పించడంతో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆయనను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బాధ్యతలు స్వీకరణ అనంతరం సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 సుధాకర్ ఉపాధ్యాయులు హనుమంత్ రెడ్డి, వెంకట శ్రీనివాసులు, రాజ వర్ధన్ రెడ్డి మండల విద్యా కార్యాలయ సిబ్బంది పాల్గొని తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img