Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

బ్యాంకు అధికారులు రైతులకు అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలి..

ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ లిఖిత
విశాలాంధ్ర – ధర్మవరం : ఏడీసీసీ బ్యాంకులో గల అధికారులు రైతులకు అన్నివేళలా అందుబాటులో ఉండాలని ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ లిఖిత తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మండల పరిధిలోని గో ట్లురు ఏడీసీసీ బ్యాంకును వారు తనిఖీ చేశారు. అనంతరం బ్యాంకు ప్రగతి వివరాలను మేనేజర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. క్రాఫ్ట్ రెన్యువల్ జరుగు తీరును అడిగి తెలుసుకున్నారు. బ్యాంకులో డిపాజిట్లు రెన్యువల్స్ ను మరింత వేగవంతం చేయాలని ప్రస్తుతం రైతుల యొక్క రుణాలు గాని, రికవరీలు 50 శాతం మాత్రమే రావడం జరిగిందని, నూరు శాతం వచ్చేలా బ్యాంకు అధికారులు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. మార్చి 31వ తేదీ లోపు రికవరీ, రెన్యువల్సును పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకు వారిదేనని వారు ఆదేశించారు. అనంతరం బ్యాంకు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి కొంతమంది రైతులతో బ్యాంకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని వారు నేరుగా అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఏమైనా బ్యాంకు సమస్యలు ఉన్నాయెడల, నేరుగా బ్యాంకు మేనేజర్ ను సంప్రదించి పరిష్కరించుకోవాల్సిందిగా వారు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సురేఖ రాణి, మేనేజర్ నాగార్జున, సూపర్వైజర్లు రహమతుల్లా, నాగవేణి, సొసైటీ సీఈవోలు.. నారాయణస్వామి, దామోదర్, శ్రీధర్, పృద్వి, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img