Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

ఎక్కడా కూడా డ్రాప్ అవుట్ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి

డిఐఈఓ. రఘునాథరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లాలో ఎక్కడా కూడా డ్రాప్ అవుట్ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిఐఈఓ రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఓ పత్రికా ప్రకటనలో తెలుపుతూ పదవ తరగతి పాసైన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ లో చేరాడా ? పాలిటెక్నిక్ కాలేజీలో చేరాడా? ఐటిఐ లో చేరాడా? అను సమాచారాన్ని మండలంలోని ఎంపీడీవోలు వెంటనే తెలియజేయాలని తెలిపారు. అంతేకాకుండా ఈ జిల్లా నుంచి ఇతర జిల్లాలలో కూడా చేరి ఉంటే ఆ సమాచారాన్ని కూడా వెంటనే నమోదు చేసి నూరు శాతం జర్ సాధించాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి విద్యార్థి కూడా కళాశాలకు తప్పనిసరిగా వెళ్లే విధంగా సచివాలయ సిబ్బంది కూడా సహాయ సహకారాలను అందించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img