Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆదిరెడ్డి పరదేశి నాయుడు కు పి హెచ్ డి డాక్టరేట్

విశాలాంధ్ర – అనంతపురం : వైద్యం ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం లో గత 16 సంవత్సరాలు గా ట్యూటర్ గా వైద్య సూక్ష్మజీవ శాస్త్ర అధ్యాపకుడు గా పనిచేస్తున్న ఆదిరెడ్డి పరదేశి నాయుడు చెన్నై లోని భారత్ యూనివర్సిటీ నుంచి మంగళవారం పి హీచ్ డి డిగ్రీ పొందారు. 2016 జూలై లో మద్రాసు లోని భారత్ యూనివర్సిటీ లో పీహెచ్ డి లోకి ప్రవేశం పొందగా నేడు మే 2 వ తేదీన పబ్లిక్ వైవా పరీక్షను నిర్వహించి అర్హత సాధించడం తో నేడు డిగ్రీ నీ అందించారు. అదిరెడ్డి పరదేశి నాయుడు కు గైడ్ గా చెన్నై లోని శ్రీ బాలాజీ మెడికల్ కళాశాల మైక్రో బయాలజీ ప్రధాన విభాగాధిపతి ఆచార్య డాక్టర్ చిత్రలేఖ సాయికుమార్ వ్యవహరించారు. డెంగీ వ్యాధి పైన “కంపారిజన్ ఆఫ్ నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్-1 అంటిజన్ డిటెక్షన్ బై ఇమ్మునో క్రోమటోగ్రఫీ టెస్ట్ అండ్ ఎంజైమ్ లింక్డ్ ఇమ్మునో సార్బెంట్ అస్సే అండ్ కొరిలేశన్ విత్ రియల్ టైమ్ పొలిమేరస్ చైన్ రియాక్షన్ ఫర్ ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ డెంగీ విత్ సీరో టైపింగ్ అండ్ కో ఇన్ఫెక్షన్స్ ఆఫ్ డెంగీ ఇన్ అండ్ అరౌండ్ అనంతపురం డిస్ట్రిక్ట్” అనే అంశంపై పరిశోధనలు చేసినందుకుగాను ఈ డిగ్రీ నీ ప్రధానం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img