Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

ఎస్ఆర్ఐటి కళాశాలను ముట్టడించిన ఏఐఎస్ఎఫ్

విశాలాంధ్ర- బుక్కరాయసముద్రం: ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలను విశ్లేషించడంలో జిల్లా కలెక్టర్, విశ్వవిద్యాలయ అధికారులు నిర్లక్ష్యపు వైఖరిను నిరసిస్తూ మంగళవారం ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి చిరంజీవిలు కళాశాలను ముట్టడించారు. కళాశాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఏఎస్ఎఫ్ , బీసీ ,ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘం, ఎన్ ఎస్ యు ఐ, ఎన్ ఎస్ ఎఫ్ నాయకులును అరెస్ట్ చేసి బి కే ఎస్ పోలీస్ స్టేషన్కు తరలించారు . ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగితే వేగవంతంగా నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఉన్న ప్రోత్సాహం ప్రైవేటు పాఠశాలలో జరిగిన ఘటనపై కనీస సమాచారాన్ని కూడా వెల్లడించకుండా గోపిక పాటించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఫుడ్ పాయిజన్ పై వాస్తవిక విషయాలను అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img