ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య
విశాలాంధ్ర-గుంతకల్లు : ప్రజా మౌలిక సదుపాయాలపై నిరంతరం పనిచేసే సచివాలయ కార్యదర్శుల సమస్యలు విన్నవించుకునేందుకు వినతి పత్రాన్ని కమిషనర్కు ఇచ్చేందుకు వెళ్తే వినతి పత్రాన్ని గోడకేసి అతికించుకోండని దుర్భాషలాడిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బాధ్యతతో విధులు నిర్వహిస్తున్న సచివాలయ కార్యదర్శులు ప్రతిరోజు 1.సెక్రటరీ ఆఫ్ వార్డ్ అడ్మినిస్ట్రేషన్ – సాధారణ పరిపాలన, సమన్వయం, సమస్య పరిష్కారం, ప్రజా స్పందనలు మరియు మునిసిపల్ పన్ను వసూళ్లు.2. వార్డు సౌకర్యాల కార్యదర్శి – నీటి సరఫరా, పౌర సౌకర్యాలు, రోడ్లు, మురుగు కాలువలు, దూడలు,శ్మశానవాటికలు.3. పర్యావరణ కార్యదర్శి – సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్,యానిమల్ కేర్.4.వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ -మున్సిపల్ ఎడ్యుకేషన్,అమ్మ ఒడి, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్,కీలక గణాంకాలు, సంస్కృతి, పండుగలు.5. ప్రణాళిక మరియు రెగ్యులర్ సెక్రటరీ – అర్బన్ &టౌన్ ప్లానింగ్, భూ వినియోగం, కారిడార్ బిల్డింగ్, ఫైర్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్, నీటి సంరక్షణ,6. సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి – ఎస్సి,ఎస్టి,బీసి,
మైనారిటీలు, యువత ఉపాధి, గ్రాడ్యుయేషన్, పేదరిక నిర్మూలన, వైఎస్ ఆర్ బరోసా,వైఎస్ ఆర్ పెన్షన్ స్కీమ్. 7. వార్డ్ ఎనర్జీ సెక్రటరీ – స్పేర్ లైట్స్, ఎలక్ట్రిసిటీ సప్లై,సబ్సిడీ.8. వార్డు ఆరోగ్య కార్యదర్శి – ప్రజారోగ్యం, జనన మరణాల నమోదు, వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ,వైఎస్ ఆర్ బీమా,సమగ్ర శిశు అభివృద్ధి పథకాలు.9. వార్డ్ రెవెన్యూ సెక్రటరీ – ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్
ప్రోగ్రామ్లు, పౌర సరఫరాల జారీ, డిజిటలైజేషన్ సర్టిఫికెట్లు, విపత్తు నిర్వహణ.10. మహిళలు మరియు బలహీన వర్గాల రక్షణ కోసం
వార్డు కార్యదర్శి – మహిళా భద్రత, మహిళల అసురక్షిత కార్యకలాపాల నివారణ మరియు మద్యపాన నిషేధం తదితర వాటిపై విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులను అవమానించి వినతి పత్రాన్ని గోడకి అతికించుకోమని చెప్పడం చాలా బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు చెప్పుకోవడం హక్కు అన్నారు అయితే ఇలాంటి కమిషనర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయ కార్యదర్శులకు ఏఐటియుసి పారిశుద్ధ కార్మికులు ఏఐటియుసి నాయకులు సిపిఐ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు అండగా నిలుస్తాయని వారి పరిష్కారానికి అందరు కూడా కలిసికట్టుగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో ఏఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి సురేష్, ఏఐటీయూసీ నాయకులు చిదంబరం, గురుస్వామి,కొండయ్య, నాగరాజు, చిన్న తదితరులు పాల్గొన్నారు.