Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

ఏఐవైఎఫ్ రాష్ట్ర సదస్సుకు బయలుదేరిన గుంతకల్లు నాయకులు…

సిపిఐ జెండాను ఊపి ప్రారంభించిన సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్

విశాలాంధ్ర-గుంతకల్లు : ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ ,టూ, ఎస్సై కానిస్టేబుల్ మరియు మెగా డిఎస్పి నోటిఫికేషన్లకై పెద్ద ఎత్తున కర్నూల్ లో రాష్ట్ర సదస్సుకు గుంతకల్లు ఏఐవైఎఫ్ నాయకులు నాలుగు చక్రాల వాహనంలో శుక్రవారం బయలుదేరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ సిపిఐ జెండాను ఊపి ప్రారంభించారు.రాష్ట్ర సదస్సుకు ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వంశీకృష్ణ ,ఏఐవైఎఫ్ నాయకులు మధు, శివ ,సాయి, పవన్ ,గణేష్ ,భాస్కర్ ,పునీత్ ,అరవింద్ ,సంతు ,నందు లు బయలుదేరారు.ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని అందుకోసం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వా మెడలు వంచి నోటిఫికేషన్ విడుదల చేసేంతవరకు దశలవారీగా ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మల్లయ్య, ఏఐఎస్ఎఫ్ నియోజవర్గం ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img