Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి

మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున

విశాలాంధ్ర ధర్మవరం:: ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 34 ప్రకారం ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీని మినహాయించడం జరిగిందని ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్లో శుక్రవారం విలేకరులతో వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ఆస్తి, ఖాళీ స్థలాలకు సంబంధించి ఇప్పటివరకు బకాయిలు ఉన్న ఈ ఏడాది ఉన్న పనుల బకాయిలు కూడా చెల్లిస్తే వడ్డీ మాఫీ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈనెల 31వ తేదీ సాయంత్రంలోగా బకాయిలు చెల్లించిన వారికి మాత్రమే ఈ వడ్డీ మాఫీ వర్తిస్తుందని తెలిపారు. ఇటువంటి అవకాశం ప్రభుత్వం విడుదల చేయడం సువర్ణ అవకాశమని తెలిపారు. పట్టణములో 64 ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి దీర్ఘకాలిక బకాయిల మొత్తం 3.87 కోట్లు ఉండగా, వడ్డీ మాఫీ కింద2.47 కోట్లు ఫోను ప్రభుత్వ కార్యాలయాలు కేవలం 1.40 కోట్లు కట్టాల్సి ఉందని తెలిపారు. కావున వివిధ ప్రభుత్వ అధికారులు ఈ పన్నులపై శ్రద్ధ చూపితే పట్టణం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ప్రైవేట్ ప్రాపర్టీస్ కు సంబంధించి 13,385 మందికి రూ.1.69 లక్షలు వడ్డీ మాఫీగా వర్తిస్తుందని తెలిపారు. అదేవిధంగా నీటి పన్నులు కూడా ఏడేళ్లుగా 5.55 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. వీటిని ప్రజలందరూ సకాలంలో చెల్లించాలని తెలిపారు. తదుపరి కళాజ్యోతి సర్కిల్లో మున్సిపల్ కాంప్లెక్స్ దెబ్బతినడం వల్ల దానిని పూర్తిగా తొలగించడం జరిగిందని, గుడ్ విల్ పద్ధతిన ప్రభుత్వ అనుమతితో నూతన కాంప్లెక్స్ నిర్మించడానికి ఒక కోటి 52 లక్షలు నిధులు మంజూరు అయినట్లు వారు తెలిపారు. అందుకే ఈనెల 20వ తేదీ సోమవారం కళా జ్యోతి సర్కిల్లో బహిరంగవేలమును ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ వేలం పాటలో పాల్గొనేవారు 1,50,000 డిపాజిట్ రూపంలో వేలంపాట రోజు గంట ముందే నగదు చెల్లించాలని తెలిపారు. దీంతోపాటు సాల్వంచ సర్టిఫికెట్ కింద రెండు లక్షల 50 వేలు తప్పనిసరిగా కట్టాలని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఏడు గదులు, ఒకటవ అంతస్తులో ఎనిమిది గదులు నిర్మించడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క గదికి రూ.10.2115 గుడ్ విలువ నిర్ణయించామని, ప్రతినెల బాడుగ రూ.6,852 ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, నాయి బ్రాహ్మణులు, దివ్యాంగులకు మాత్రం నెలకు రూ.585 గా నిర్ణయించడం జరిగిందన్నారు. కావున ఈ అవకాశాన్ని వ్యాపారస్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా దినవారపు మార్కెట్, జంతు వదశాల యొక్క వేలం ప్రకటన ఈనెల 21వ తేదీ ఉదయం 11 గంటలకు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఆనంద్, ఆర్ఐ. షావలి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img