Friday, June 9, 2023
Friday, June 9, 2023

రామగిరి జడ్పీ హైస్కూల్ హై స్కూల్ లోని అదనపు తరగతి గదులు బీసీ హాస్టల్ కి కేటాయించండి

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు విజయభాస్కర్వి

శాలాంధ్ర – ధర్మవరం:: డివిజన్ పరిధిలోని రామగిరి మండలంలో జడ్పీ హైస్కూల్లో గల అదనపు గదులను బీసీ హాస్టళ్లకు కేటాయించాలని కోరుతూ సోమవారం ఆర్డిఓ తిప్పే నాయకులు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలంలోనే ప్రభుత్వ బి సి కళాశాల బాలుర వసతి గృహం ను రామగిరి నందు 2012 వ సంవత్సరం లో ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుండి వసతి గృహం ను అద్దె భవనాలలో నిర్వహిస్తున్నా రానీ, ఆ భవనానికి ప్రహరీ గోడ లేకపోవడం తో అప్పుడప్పుడు పాములు, పందులు, కుక్కలు , హాస్టల్లోకి రావడంతో అక్కడున్న విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు అని తెలిపారు. ఈ కారణంగా అద్దె భవనంలో ఉన్న బీసీ బాలుల హాస్టల్ ను రామగిరి జడ్పీహై స్కూల్ నందు అదనపు తరగతుల గదులు ఖాళీగా ఉన్నందున అందులో నాలుగు గదులను హాస్టల్ విద్యార్థులకు కేటాయించలని, జడ్పీ హైస్కూల్ అదనపు తరగతుల గదుల్లో ఇంతకుముందు పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నా రానీ,మరి కొన్ని నెలల కిందట పాలిటెక్నిక్ విద్యార్థులకు సొంత భవనం నిర్మించారు అని తెలిపారు. అందుకుగాను అక్కడున్న పాలిటెక్నిక్ విద్యార్థులు సొంత భవనాల్లోకి విద్యార్థులు వెళ్లారు అని తెలిపారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాల శ్రీకారం చుడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి, నాగ, సాయి, మారుతి, రవి మొదలగు వారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img