– జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లా నుండీ బదిలీపై వెళ్తున్న ఎస్పీ కె.శ్రీనివాసరావు కి జిల్లా ఏ.ఆర్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో ఈరోజు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించి అభిమాన వీడ్కోలు పలికారు.
జిల్లా ప్రజలు, పోలీసులు చూపించిన ప్రేమ, అభిమానం ఎల్లవేళల మరువలేనని ఎస్పీ వెల్లడి
తక్కువ కాలం పని చేసినా ఎక్కువ సంతృప్తినిచ్చింది. ఇక్కడి సిబ్బంది మంచి సమన్వయంతో పని చేస్తుండటం శుభపరిణామం. ఈకార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారి కుటుంబ సభ్యులు, సెబ్ అదనపు ఎస్పీ జి.రామకృష్ణ, డీఎస్పీలు బి.శ్రీనివాసులు, సీఎం గంగయ్య, యు.నరసింగప్ప, జి.ప్రసాదరెడ్డి, బి.వి.శివారెడ్డి, మునిరాజ్ (ఏ.ఆర్), సి.ఐ లు జాకీర్ హుస్సేన్, ఇందిర, విశ్వనాథచౌదరి, దేవానంద్, రెడ్డెప్ప, శివరాముడు, ధరణీకిశోర్, ప్రతాప్ రెడ్డి, నరేంద్రరెడ్డి, నాగార్జునరెడ్డి, ఆర్ ఐ లు హరికృష్ణ, రాముడు, లీగల్ అడ్వైజర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్పీ సిసి ఆంజనేయప్రసాద్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, తేజ్ పాల్, సరోజ, పలువురు ఎస్సైలు, ఆర్ ఎస్ ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.