Monday, September 25, 2023
Monday, September 25, 2023

అమృత మూర్తి పల్లె ఉమా సేవలు మరువలేనివి

విశాలాంధ్ర- జేఎన్టీయూఏ: నిరుపేదలకు చేయూతగా బాలాజీ విద్యాసంస్థల తోడ్పాటు.. సామాజిక సేవ కార్యక్రమాల్లో తనదైన ముద్రను వేసుకుని విద్యార్థుల కలల స్వప్నాన్ని నెరవేర్చిన అమృత మూర్తి పల్లె ఉమా సేవలు మరవలేనివని పి వి కె కె డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా. వై ముని కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వీర ప్రకాష్, బి . ఎడ్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బాలాజీ విద్యాసంస్థల కరస్పాండెంట్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమా జయంతిని పురస్కరించుకుని హౌసింగ్ బోర్డ్ కాలనీలో సాయ భారతి సేవ సమితి మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు రెండు బియ్యం బస్తాలతో పాటు క్రీడా సమగ్రని అందజేశారు. అనంతరం వల్లేమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. పల్లె ఉమా ట్రస్టు తో విద్యార్థులకు ప్రోత్సాహకాలు, సామాజిక సేవ కార్యక్రమాలు మరువలేనిమన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో ధనుష్, రమణ, అత్యధిక బృందం మహేష్, శ్రీనివాసరావు, హరీష్, నాగరాజు, మున్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img