విశాలాంధ్ర – ధర్మవరం:: అనంతపురం కు సమీపంలో గల బొమ్మపర్తి దగ్గర జయలక్ష్మి పురం లో గణపతి సచ్చిదానంద స్వామి వారి తల్లి గుడిలో ధర్మవరం శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య చార్యులు బాబు బాలాజీ శిష్య బృందం చే నిర్వహించిన మహిషాసురమర్దిని నృత్య నాటకం ప్రదర్శన అందరిని ఆకట్టుకొంది. ఈ కార్యక్రమానికి దత్త పీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి విచ్చేసి, నాట్యములు తిలకించి, అభినందన ఆశీర్వాదములు ఇవ్వడం జరిగిందని బాబు బాలాజీ తెలిపారు. ఈ నృత్య నాటకంలో మహిషాసురునిగా రామలాలిత్య దుర్గమ్మగా సర్వ శ్రీ తో పాటు 25 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. శ్రీ లలిత నాట్య కళానికేతన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇస్తూ, భారతదేశ సంస్కృతి కళ్ల ను మరింత విస్తృతం చేయడమే మా ధ్యేయమని వారు తెలిపారు.