Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పొలాలకు హద్దురాళ్లు పాతేందుకు శ్రీకారం

విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామంలో భూ రీసర్వేలో భాగంగా శుక్రవారం పొలాల్లో హద్దురాళ్లు పాతేందుకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఇందుకు సంబంధించి గ్రామ సర్పంచ్ బుడ్డా అంజినమ్మ, వైసీపీ నాయకులు శివరాం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హద్దురాళ్లు పాతడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భగవంతున్ని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో ఆంజనేయులు, గ్రామ సర్వేయర్ రాజశేఖర్, వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img