Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

పేదల కోసం అన్నక్యాంటీన్

విశాలాంధ్ర – పెనుకొండ : నగర పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ కూడలి నందు ఏడవ రోజు కూడా అన్న క్యాంటీన్ కు ఆదరణ పెరుగుతుంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవితమ్మ తన సొంత ఖర్చులతో పేదలకు ఆకలిని తీరుస్తూ ఎంతోమంది కార్మికుల కర్షకులు బీదల కోసం కడుపు నింపాలన ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించామని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చెప్పిన విధంగా పట్టెడు అన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం అంటూ రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంతో ప్రారంభించి ఎన్టీఆర్ అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు దేశంలో సంక్షేమ పాలనకు బీజం వేశాయి. తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లకు స్ఫూర్తి ఈ వాక్యమే. అన్నా క్యాంటీన్ వద్ద 5 రూపాయలకే భోజనం ఏర్పాటుచేసినామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో క్రిస్టప్ప, బాబుల్ రెడ్డి,నంజుండా, సానిపల్లి గ్రామకమిటీ అధ్యక్షుడు వెంకటేష్, శివ నాయక్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img