జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు
విశాలాంధ్ర -ధర్మవరం:: ధర్మవరం పట్టణంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వాహకులు కుటుంబ సభ్యులు నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంలో మూడవరోజు కావడంతో బుధవారం పట్టణములో వినాయక చవితి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి డబ్బు వాయిద్యాలతో పలు డాన్సులతో ర్యాలీగా వెళ్లి వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు కీర్తిశేషులు బెస్త చిన్నరామయ్య సతీమణి కీర్తిశేషులు సుబ్బమ్మ జ్ఞాపకార్థం వీరి కుమారులు బెస్త శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు ఆ వార్డు వీధిలో జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇక్కడ జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.