శ్రీకృష్ణ చైతన్య భక్త భజన మండలి నిర్వాహకులు
విశాలాంధ్ర- ధర్మవరం : దాతల సహాయ సహకారంతోనే అన్నదాన కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నామని శ్రీకృష్ణ చైతన్య భక్త భజన మండలి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని అవధూత తిక్క నారాయణ స్వామి ఆశ్రమంలో దాత బ్రాహ్మణి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు సునీత రెడ్డి వీర బ్రహ్మ రెడ్డి చెల్లెలు నేహనా రెడ్డి వారు కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు అనాధాశ్రమములోని అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ చైతన్య భక్త భజన మండలి నిర్వాహకులు దాతలకు ప్రత్యేక పూజలు చేయించి, కృతజ్ఞతలను తెలియజేశారు. తదుపరి నిర్వాహకులు మాట్లాడుతూ ఎవరైనా అన్నదానం చేయుటకు ఆసక్తి గలవారు సెల్ నెంబర్:: 9000854468కు గాని 801982198 కు ఫోన్ చేస్తే, అన్నదానం చేసే అవకాశము ఉంటుందని వారు తెలిపారు. కావున ఆసక్తి దాతలు ముందుకు వచ్చి, పేద, అనాధ ప్రజలకు అన్నదాన కార్యక్రమములో భాగస్వాములు కావాలని వారు కోరారు.