Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

ఏపీ ఐఎంఏ ఉమెన్ డాక్టర్స్ వింగ్ చైర్పర్సన్ గా డాక్టర్ జి.హేమలత

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : నంద్యాలలో జరిగినటువంటి సెవెన్త్ ఐఎంఏ ఏపీకాన్ 2022 కాన్ఫరెన్స్లో ఐఎంఏ ఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కృష్ణ, ఏపీ ఐఎంఏ ఉమెన్ డాక్టర్స్ వింగ్ చైర్ పర్సన్ డాక్టర్ హేమలత ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు . ఐఎంఏ ఉమెన్ డాక్టర్ వింగ్ తరపున రాష్ట్రం మొత్తంలో మహిళలకు ,చిన్న పిల్లలకు, వృద్ధులకు , స్కూల్స్ మరియు కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు ఎన్నో అవగాహన సదస్సులు, మెగా హెల్త్ క్యాంపు లు రాష్ట్రం మొత్తం నిర్వహిస్తారు.
2021-22 సంవత్సరం గాను అనంతపూర్ ఐఎంఏ బ్రాంచ్ రాష్ట్ర స్థాయి ఐఎంఏలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది .ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంది . అనంతపురం ఐఎంఏ బ్రాంచ్ చేసిన సేవలకు రాష్ట్ర ఐఎంఏ కార్యవర్గ సభ్యులు అనంతపూర్ ఐఎంఎ బ్రాంచ్ కు ఏడు అవార్డులను నంద్యాలలో జరిగిన ఏడవ ఐఎంఎ ఎపికాన్ 2022 కాన్ఫరెన్స్లో ప్రదానం చేశారు.
1.బెస్ట్ లాడ్జ్ బ్రాంచ్ ఫర్ ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్

 1. బెస్ట్ లాడ్జి బ్రాంచ్ ఫర్ బెస్ట్ సైంటిఫిక్ ప్రోగ్రామ్
  3.బెస్ట్ ప్రెసిడెంట్
  4.ప్రెసిడెంట్ అప్రిషియేషన్ అవార్డ్ ఫర్ ఎక్స్ లెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ మిషన్ పింక్ హెల్త్
  5.బెస్ట్ ఉమెన్ డాక్టర్స్ వింగ్
  6.బెస్ట్ సెక్రటరీ
  7.బెస్ట్ ఎండ్ టీబీ ప్రోగ్రామ్

ఈ సందర్భంగా డాక్టర్ హేమలత మాట్లాడుతూ అనంతపూర్ ఐఎంఏ బ్రాంచ్ కు ఇన్ని అవార్డ్స్ రావడానికి సహకరించిన వైద్యులకు, పత్రికా విలేకరులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఐ ఎం ఏ ఉమెన్ డాక్టర్స్ వింగ్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు రాష్ట్రం మొత్తం విరివిగా నిర్వహిస్తామని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img