విశాలాంధ్ర – ధర్మవరం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సలకు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదేశాల మేరకు బిజెపి నాయకులు మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ముద్దనపల్లి నల్ల బోయినపల్లి గ్రామాలలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. తల్లి లేదా తండ్రి మృతి చెందిన వారి పిల్లలు అనాధలు కాకుండా వారికి ఈ పథకం అండగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకములో ప్రతినెల 4 వేల రూపాయలు పిల్లలకు వారి బ్యాంకు ఖాతాకు జమ అవుతుందని తెలిపారు. కావున అర్హులైన వారిని ఈ పథకంలో చేర్చాలని వారు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బత్తలపల్లి మండలం కన్వీనర్ ఆకులేటి వీరనారప్ప, బాల మల్లికార్జున ,మోదేపల్లి రవి, లక్ష్మన్న, ఆ దెప్ప ,శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తారక్ తదితరులు పాల్గొన్నారు.