Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

కౌన్సిల్ సమావేశంలో తీర్మానాలకు ఆమోదం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం గురువారం నగర పంచాయతీ కార్యాలయ సమావేశ భవనం నందు చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో 21 అంశాలను ప్రవేశపెట్టారు ముఖ్యంగా త్రాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్య సిమెంట్ రోడ్లు పారిశుద్ధ్య పనులు మంచినీటి సరఫరాకు కొత్త బోర్లు మోటర్లు విషయమై చర్చించి తీర్మానాలు చేశారు చాలా రోజుల నుంచి మంచినీటి సరఫరా లేక 3వ వార్డులో ఇబ్బంది పడుతున్నామని కౌన్సిలర్ గిరి అధికారులను ప్రశ్నించారు ఈరోజు సాయంత్రంలోగా పనులు పూర్తి చేసి త్రాగునీటి సరఫరా ఇబ్బంది లేకుండా కలుగ చేస్తామని హామీ ఇచ్చారు అలాగే దర్గాపేట రోడ్లో రోడ్ల విస్తరణలు ఆక్రమాలకు గురైతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కౌన్సిలర్లు ఆగ్రహించారు అలాగే జరగాల్సిన పనులకు టెండర్ల విషయమై చర్చించి అని పనులకు ఆమోదం తెలిపారు ఈ సమావేశంలో కమిషనర్ వంశీకృష్ణ భార్గవ, వైస్ చైర్మన్ సునీల్ ,నందిని, కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img