Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వేసవిలో పక్షులకు సంరక్షణకు కుండలు ఏర్పాటు

విశాలాంధ్ర-బుక్కరాయసముద్రం : కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో వేసవిలో పక్షులకు నీరు , ఆహారం సదుపాయం కోసం నీటికుండలు , ధాన్యపు కంకులను విశ్వవిద్యాలయంలో ఉన్న చెట్లకు ఏర్పాటు కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య మాచిరెడ్డి రామకృష్ణా రెడ్డి , రెక్టార్ ఆచార్య ఏ. మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ. ప్రకృతి విపత్తులను నిలువరించేందుకు పక్షుల పాత్ర అత్యంత కీలకమైనదన్నారు. పక్షులు తిన్న ఆహారంలోని విత్తన గింజలును వివిధ ప్రాంతాలలో వేసి మొక్కల అభివృద్ధికి కృషి ఎనలేనిది అన్నారు. అంతరించిపోతున్న పక్షుల సంరక్షణ, బాధ్యతలను ప్రతి విద్యార్థి పాలుపంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య డి. మురళీధర్ రావు , బీ.ఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. నీలకంఠాపురం సదాశివరెడ్డి ,ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.రామచంద్ర , పార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సోమశేఖర్ , ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సత్య సౌమ్య ,డాక్టర్ బాల సత్యనారాయణ,డాక్టర్ చాగంటి రామిరెడ్డి ,ఆఫీస్ సిబ్బంది ఆదినారాయణ రెడ్డి,వహిబ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img